Balineni Srinivasa Reddy Resign To Ysrcp: వైఎస్సార్‌సీపీకి మరో నేత రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగతోంది. మాజీ మంత్రి బాలినేని పార్టీకి రాజీనామా చేస్తారని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అధిష్టానం తీరుతో అలకబూనిన బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేసినా.. చర్చలు అసంపూర్తిగా ముగిశాయంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.