ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న ఇంతియాజ్ అహ్మద్.. బంధువులు, స్నేహితుల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. 2024 ఎన్నికలకు ముందు ఐఏఎస్ సర్వీసు నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఇంతియాజ్ అహ్మద్ రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ తరుఫున కర్నూలు అసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలయ్యారు.