వైసీపీకి మరో షాక్ తగిలింది. మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ డెయిరీ ఛైర్మన్‍తో పాటుగా 12 మంది డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు అడారి ఆనంద్ తెలిపారు. రాజీనామా లేఖను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. విశాఖ డెయిరీపై ఆరోపణలు.. శాసనసభా కమిటీ పరిశీలన పరిణామాల నేపథ్యంలో అడారి రాజీనామా ఆసక్తికరంగా మారింది.