వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్ళలు గుప్పించారు. వైసీపీది విధ్వంస, విచ్ఛిన్న పాలనగా పేర్కొన్న పవన్ కళ్యాణ్.. కూటమిది దక్షత, దార్శనిక పాలనగా అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వం ఆర్ధిక విధ్వంసం సృష్టించి.. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. అడుగడుగునా అప్పులు మిగిల్చారని,.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలనీ పక్కన పెట్టారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ సంస్థలకు రూ. 1.29 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి పైసా పారదర్శకంగా ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో వివిధ విభాగాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చును, కూటమి ప్రభుత్వం చేసిన ఖర్చును పోల్చారు డిప్యూటీ సీఎం.