హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మెుత్తం నాలుగు మార్గాల్లో ఈ బస్సులను నడుపుతుండగా.. జనవరి 1న రెండు ఏరో రైడర్ సర్వీసులు ప్రారంభించినట్లు చెప్పారు. పుష్పక్ బస్సులో ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.