హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 19వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు విమానం దిగక ముందే.. కుప్పకూలిపోగా.. మరొకరు మాత్రం విమానం దిగి ఎయిర్‌పోర్టు లోపలికి వచ్చిన కాసేపటికే కుప్పకూలిపోయారు. అయితే.. వీళ్లిద్దరు వేరు వేరు విమానాల్లో వేరు వేరు ప్రాంతాల నుంచి శంషాబాద్‌కు చేరుకోగా.. ఒకే రోజు ఇలా ప్రాణాలు వదలటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాసంగా మారింది.