హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ విమానాశ్రయానికి మరోసారి అవార్డు లభించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తోన్న బెస్ట్ ఎయిర్ పోర్టుగా శంషాబాద్ విమానాశ్రయం నిలిచింది.