శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం మండల-మకరవిళక్కు పూజలు జరుగుతున్న వేళ.. ఇప్పటికే శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరిన్ని సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి మరో 28 రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వివిధ స్టేషన్లలో ప్రారంభమై.. శబరిమలకు చేరుకోనున్న రైళ్ల వివరాలను తాజాగా వెల్లడించింది.