హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చారు. శుభకార్యాలకు వెళ్లినప్పుడు పూల బొకేలు, ఖరీదైన బహుమతులు కాకుండా.. పుస్తకాలనే గిఫ్టులుగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. పుస్తకాలు చదువుతుంటే.. రచయితలతో నేరుగా మాట్లాడిన భావన కలుగుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.