కొంత మంది ఉన్నత చదువులు చదివి.. పెద్ద ఉద్యోగం చేయాలనే ఆశతో ఉంటారు. కానీ దానికి తగ్గట్లు ఆర్థిక స్థోమత, కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మధ్యలో తమ చదువులు ఆపేసి ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటారు. ఇక మహిళలకు అయితే పెళ్లి చేసి.. తమ బాధ్యతలను తీర్చుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు. కానీ.. వారికి ఇంకా చదవాలనే కోరిక మాత్రం అలానే ఉండిపోతుంది. అలాంటి వారి కోసం ఓపెన్ విద్య అనేది ఒక వరంలాంటిది. ముఖ్యంగా తెలంగాణలో డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇలాంటి వారి ఎందరో కలలను నెరవేర్చింది. మధ్యలో చదువు ఆపేసిన వారికి.. ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకునే వారికి వారి కోరికలను తీర్చింది.