ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వాన్‌గార్డ్ గ్రూప్ హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ప్రారంభించనుంది. ఇది భారత్‌లో వారి తొలి జీసీసీ. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి జీసీసీ కార్యాలయాన్ని ప్రారంభించి, 4 సంవత్సరాల్లో 2,300 ఉద్యోగులను నియమించుకునేది లక్ష్యంగా వాన్‌గార్డ్ పెట్టుకుంది.