కన్నడ నటి శోభిత సూసైడ్ కేసులో గచ్చిబౌలి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకోగా.. తాజాగా కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అందులో వారు కీలక విషయాలు వెల్లడించారు. ఆమె ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ఒంటరిగా ఉండటం, ఇండస్ట్రీలో అవకాశాలు రాక డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.