తిరుపతిలో అద్భుతం జరిగింది. ఓ శివాలయంలో శివుడి విగ్రహం కళ్లు తెరిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భక్తులు శివాలయానికి తరలి వస్తున్నారు. మరోవైపు శాస్త్రీయ కారణాలతో ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. వాతావరణ పరిస్థితులు, కాంతి పరావర్తనం , ఇల్యూజన్ వంటి కారణాలతో ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఆలయానికి మాత్రం భక్తులు తరలి వస్తున్నారు.