17439 Tirupati Srikakulam Road Humsafar Express From April 13: శ్రీకాకుళం ప్రజలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీపికబురు చెప్పారు. శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా మొట్ట మొదటి రైలు అందుబాటులోకి రానుంది. రైల్వేశాఖ శ్రీకాకుళం రోడ్ టు తిరుపతి 17439/17440 హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసింది. ఈనెల 13వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభంకానుంది. శ్రీకాకుళం రోడ్ నుంచి ప్రతి సోమవారం, తిరుపతి నుంచి ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.