ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి మళ్లీ వార్తల్లో నిలిచింది. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అతిథి గృహంలో కొంతమంది మద్యం తాగి హల్ చల్ చేశారు. మాంసం తింటూ మద్యం తాగుతూ అతిథి గృహంలోని మిగతా వారికి ఇబ్బంది కలిగించారు. మందుబాబుల వ్యవహారంపై మిగతా యాత్రికులు అతిథి గృహం ఇంఛార్జికి ఫిర్యాదు చేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు అక్కడకు చేరుకుని మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మోహన్ రెడ్డి తండ్రి మాధవరెడ్డి దేవస్థానంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిసింది.