తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బొలిశెట్టి సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. భక్తులు అందించిన విరాళాలతో శ్రీవాణి ట్రస్టు నిధులు సమకూరాయన్న బొలిశెట్టి.. ఈ నిధులను ఏకపక్షంగా ప్రభుత్వ పట్టణాభివృద్ధి ప్రణాళికలకు వాడుకోవాలని ఆదేశించటం సరికాదని విమర్శించారు. ట్రస్టు నిధులను రాజకీయ ప్రయోజనాలకు మళ్లించటం ఆపాలని డిమాండ్ చేశారు.