తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల పాటు ద్వార దర్శనాలకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. ఈ పదిరోజులు టోకెన్లు ఉన్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం టీటీడీ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. తిరుమల, తిరుపతిలో మొత్తం 91 కేంద్రాలలో టోకెన్లు పంపిణీ చేయనున్నారు. మొదటి మూడురోజులకు లక్షా 20 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. మిగతా వాటిని ఆ ముందురోజు జారీ చేస్తామని చెప్పారు.