తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తుంటే.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేకుంటే చిక్కులు తప్పవు. ఎందుకంటే శుక్రవారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పు చేసింది. శ్రీవారి మెట్టు మార్గంలోని దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని మార్చింది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌కు దీనిని మార్చారు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోవాలి. అలాగే భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్ పొందిన భక్తులు శ్రీవారి మెట్టులోని 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించాల్సి ఉంటుంది.