Nara Lokesh on Gummadi Sandhya rani family viral video:తిరుమలలో అపచారం జరిగిందని.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబసభ్యులే దీనికి కారణమంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. తన కుటుంబంపై కొన్ని కుక్కలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్న సంధ్యారాణి.. భగవంతుడు వారిని క్షమించడంటూ ఎమోషనల్ అయ్యారు. అటు మంత్రి నారా లోకేష్ సైతం దీనిపై స్పందించారు. తప్పుడు ప్రచారాలు ఇకనైనా మానుకోకపోతే.. శ్రీవారితో పెట్టుకుంటే ఒక్క సీటు కూడా మిగలదంటూ వైఎస్ జగన్‌ను హెచ్చరించారు.