శ్రీశైలం: ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక కండక్టర్ దాడి.. బలవంతంగా బస్సులోకి ఎక్కించి మరీ..

1 month ago 5
ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ మీద కర్ణాటక కండక్టర్ దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లాలోని శ్రీశైల శిఖరం చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకుంది. కర్ణాటక బస్సును అడ్డదిడ్డంగా నడపటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఏపీ ఆర్టీసీ డ్రైవర్, కర్ణాటక డ్రైవర్‌ను బస్సు సరిగా నడపలేవా అని ప్రశ్నించారు. దీంతో మాటామాటా పెరిగి పీలేరు ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాంద్ భాషాపై.. కర్ణాటక బస్సు కండక్టర్, ప్రయాణికులు దాడి చేశారు. బస్సులోకి బలవంతంగా ఎక్కించి, కొట్టుకుంటూ వెళ్లి డోర్నాల వద్ద వదిలేశారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article