శ్రీశైలం క్షేత్రంలో ఓ యువతి చేసిన పని.. ఇప్పుడు మల్లన్న భక్తులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ కావాలని.. ఓ యువతి డ్యాన్స్ స్టెప్‌లు వేసింది. అది కూడా పవిత్రమైన ఆలయానికి వచ్చి సినిమా పాటలు, ప్రైవేటు సాంగ్స్ పెట్టుకుని.. డ్యాన్స్ రీల్స్ చేస్తూ నానా హంగామా చేసింది. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది చూసిన నెటిజన్లు, భక్తులు.. ఆ యువతిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.