శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలంలో జనవరి ఒకటో తేదీన మల్లికార్జునస్వామి స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీశైలానికి భక్తుల తాకిడి పెరగనుంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీశైలంలో స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. అలాగే ఉదయాస్తమాన, ప్రాతకాల, ప్రదోషకాల సేవలు కూడా జనవరి ఒకటో తేదీన రద్దుచేసినట్లు తెలిపింది. భక్తులను అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు శ్రీ శైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.