శ్రీశైలం వెళ్లే భక్తులకు తీపికబురు.. దేవస్థానం కీలక నిర్ణయం

1 month ago 3
శ్రీశైలం వచ్చే యాత్రికులకు దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. ఇకపై రద్దీ రోజుల్లో కూడా శ్రీశైలంలో స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. శని, ఆది, సోమవారాలతో పాటుగా పర్వదినాల వంటి రద్దీ రోజుల్లోనూ భక్తులకు స్పర్శ దర్శనం కల్పిస్తామని తెలిపారు, అలాగే స్పర్శ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన మీదట వైదిక కమిటీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Read Entire Article