తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మధ్య ఉన్న నీటి వివాదాలకు స్పందించి కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేసంలో.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ, ఏపీకి ఎంతెంత వాటాలు పంపిణీ చేయాలన్న కీలక అంశాలపై కేఆర్ఎంబీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు.. వాటాలు నిర్ణయించింది. నీటి నిల్వలు సరిపోయినంతగా లేవు కాబట్టి.. పొదుపుగా వాడుకోవాలని.. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో వ్యవహరించాలని బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.