Srisailam Leopard Spotted: శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటికి సమీపంలో చిరుత ప్రత్యక్షమైంది. ఏఈవో ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చి కుక్కను తీసుకెళ్లింది. చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటన తర్వాత స్థానికులతో పాటూ భక్తులు ఆందోళనలో ఉన్నారు. అటవీశాఖ అధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. స్థానికులు, భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.