హైదరాబాద్-శ్రీశైలం మధ్య ప్రయాణాలు చేసే వారికి గుడ్‌న్యూస్. ప్రస్తుతం ప్రమాదకర మలుపులతో ప్రయాణం జరుగుతుండగా.. త్వరలో ఎలాంటి ఘాట్ రోడ్డు లేకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చు. దానికి తోడు ప్రయాణ దూరం కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఈ మేరకు గతంలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ స్థానంలో టన్నెల్ రోడ్డు నిర్మించాలని కేంద్రం భావిస్తోంది.