తిరుపతి-సాయినగర్ శిర్డీ రైలుకు ఫుల్లు డిమాండ్ ఉంటుంది. అయితే దీనిని మధ్యలో రద్దు చేశారు. ఈక్రమంలో దీన్ని క్రమబద్ధీకరించేందుకు రైల్వే అధికారులు కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడంతో రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ రైలును రెగ్యులర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక రైలుగా నడుస్తున్న దీనిని క్రమబద్ధీకరిస్తే భక్తులకు, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఆ వివరాలు..