షూటింగ్‌‌లో బిజీగా ఉన్నా.. ఎక్కడికి పారిపోలేదు, కేసులంటే భయం లేదు: ఆర్జీవీ

2 months ago 4
ఏపీ పోలీసులు దర్శకుడు రాంగోపాల్‌వర్మ కోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల కేసులు, గాలిస్తున్న అంశాలపై వర్మ ఎట్టకేలకు స్పందించారు.. ఓ వీడియోను విడుదల చేశారు. కేసులకు తానేమీ భయపడటం లేదని.. తాను పోస్టులు పెట్టినవారికి కాకుండా సంబంధం లేనివారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నానని.. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసులు వర్మపై కేసు చేసి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
Read Entire Article