ట్రేడింగ్ పేరుతో యువతకు కుచ్చుటోపి పెట్టిన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. కడపకు చెందిన సోమశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి షేర్ మార్కెట్ పేరుతో తమను మోసం చేశారంటూ 30 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధిక లాభాల పేరుతో ఆశజూపించి 12 కోట్ల రూపాయలు తమతో వసూలుచేశారని.. ఇచిన డబ్బును తిరిగి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.