ఏపీలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం 'పల్లె పండుగ 2.0' కార్యక్రమానికి ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీల్లో రూ.6,500 కోట్లతో 52 వేల పనులు చేపట్టనున్నారు. ఉపాధి హామీతో పాటు వివిధ నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నారు. దీని ద్వారా పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతేడాది మొదటిసారిగా రూ. 4,500 కోట్లతో పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.