సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగరేస్తారు. అయితే పతంగులు ఎగురేవేసే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. తాజాగా.. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పతంగులు ఎగురవేస్తూ భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.