AP Govt 6700 Crores Funds Release: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం వివిధ వర్గాలకు శుభవార్త వినిపించింది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారుగా రూ.6,700 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ పెండింగ్ బిల్లులను అధికారులు అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఆర్థిక శాఖ అధికారులు, మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. సోమవారం సాయంత్రానికి అకౌంట్లలోకి డబ్బులు జమ చేయాలని చర్యలు చేపడుతున్నారు.