సంక్రాంతికి ఊరెళ్లేవారికి రైల్వే గుడ్ న్యూస్.. త్వరపడండి..

3 weeks ago 5
సంక్రాంతికి ఊరెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది, కాచిగూడ, హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన్‌కు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. జనవరి 9,10,11,12 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్ బుకింగ్ కోసం రిజర్వేషన్లు జనవరి రెండు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. రైలు ప్రయాణికులకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.
Read Entire Article