తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' సందర్భంగా హైదరాబాద్‌లోని కీలక రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు, యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు 'ప్రెసిడెంట్ ట్రంప్ ఎవెన్యూ'గా నామకరణం చేయనున్నారు. అలాగే.. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల పేర్లతోనూ జంక్షన్లకు పేర్లు పెడతారు. ఈ సందర్భంగా చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్‌పై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించనున్నారు.