సంధ్య థియేటర్ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా బౌన్సర్ ఆంటోని అని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బౌన్సర్లకు ఆంటోని ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆరోజు వారి అత్యుత్సాహం వల్లే ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.