Parenting Tips: పుష్ప-2 సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై పెద్ద పెద్ద సంచలనాలే జరుగుతున్న నేపథ్యంలో.. ఓ నెటిజన్ ఈ పరిస్థితిని పూర్థి భిన్న కోణంలో ఆలోచించారు. అక్కడా ఆ పిల్లాడి అభిమానం, ఆ పిల్లాడిపై తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ కాకుండా.. పిల్లలకు తల్లిదండ్రులుగా మనం ఏం నేర్పిస్తున్నాం.. వాళ్ల మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నామనేది సవివరంగా విశ్లేషించారు. ప్రతి ఒక్క తల్లిదండ్రి తప్పక చదవాల్సిందే.