సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ సంచలన వ్యాఖ్యలు

3 weeks ago 2
గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. సంధ్య థియేటర్ కేసులో అచ్చం ఇలాగే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు సినీ ఇండస్ట్రీనే కుదిపేసిన ఈ ఘటనపై తొలిసారి ఆయన స్పందించారు. సోమవారం మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్‌లో పవన్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకున్నాడని వ్యాఖ్యానించారు. అభిమాని మృతిచెందిన విషయం తెలియగానే వెంటనే వాళ్లింటికి వెళ్లి పరామర్శించాల్సిందని.. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్లు తనకు అనిపించిందని పవన్ వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌ కాకపోయినా కనీసం ‘పుష్ప 2’ టీమ్ అయినా వెంటనే స్పందించి సంతాపం తెలిపితే సమస్య ఇంత జఠిలంగా మారి ఉండేది కాదన్నారు. రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయాడని అల్లు అర్జున్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారనడం సరికాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
Read Entire Article