సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ టీమ్‌పై పోలీస్ కేసు నమోదు

1 month ago 5
పుష్ప-2 సినిమా విడుదల వేళ.. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదైంది. బుధవారం (డిసెంబర్ 04న) రోజున ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ వచ్చిన నేపథ్యంలో.. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వనందుకు అటు అల్లు అర్జున్ బృందంపై.. భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఇటు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Entire Article