పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌ను డాక్టర్లు రిలీజ్ చేశారు. ప్రస్తుతం అతడు కళ్లు తెరిచి చూడటం లేదని.. మట్లాడటం లేదని అన్నారు. గొట్టం ద్వారానే లిక్విడ్ ఫుడ్ అందిస్తున్నట్లు చెప్పారు.