సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అతడు ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉన్నాడని, జ్వరం పెరుగుతోందని చెప్పారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని, చిన్నారిని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు.