మహా శివరాత్రి పండుగ సందర్భంగా నాగిలేరు సదాశివకోన ఆలయాన్ని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా సందర్శించారు. అలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మండలం, మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సందర్శించడం, పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు రోజా. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. మరోవైపు శివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది.