తెలంగాణ ప్రభుత్వ బడుల్లో SA-1, SA-2 పరీక్షల మూల్యాంకన విధానాన్ని విద్యాశాఖ మార్చింది. ఇకపై సొంత పాఠశాల విద్యార్థుల జవాబు పత్రాలను ఆయా టీచర్లు దిద్దే అవకాశం ఉండదు. పరీక్షలు పాఠశాలల్లోనే నిర్వహించినా, పేపర్లను అదే రోజు ఎంఈఓకు అప్పగించి మండల స్థాయి మూల్యాంకన కేంద్రాల్లో ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో దిద్దిస్తారు. ఈ విధానంతో పారదర్శకత, నిష్పాక్షికత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మూల్యాంకనం మూడు నుంచి ఐదు రోజుల్లో పూర్తి చేసి ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేయాలి.