సరోగసీ కోసం వచ్చిన మహిళను నెల రోజుల పాటు ఫ్లాట్‌లో నిర్భందించి లైంగిక వేధింపులకు పాల్పడంతో.. భరించలేక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన.. హైదరాబాద్ రాయదుర్గంలో జరిగింది. సరోగసి కోసం 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని.. మహిళను తీసుకొచ్చిన ఆ వ్యక్తి నెల రోజులుగా బయటికి రాకుండా ఫ్లాట్‌లో బంధించి, తన భర్తను కూడా కలవనీయకుండా చేసి వేధింపులకు గురి చేయగా.. అతని నుంచి తప్పించుకునేందుకు బిల్డింగ్ మీదికి నుంచి దూకి మరణించింది.