జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వం జోష్‌లో ఉంది. ఈ ఉత్సాహంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే.. బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన సవాలుగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. దీంతో, బీసీ రిజర్వేషన్లపై అధికారులు 50 శాతం పరిమితిలోనే ఉండేలా కొత్త నివేదికను రూపొందించారు. ఈ నిర్ణయంపై బీసీల నుంచి వ్యతిరేకత రాకుండా నాయకులకు వివరించాలని సీఎం మంత్రులకు సూచించారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.