తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ను తొలగించేందుకు ఆర్డినెన్స్ తేనున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం లభిస్తే.. కొత్త నిబంధనలకు అమల్లోకి వస్తాయి. రానున్న స్థానిక ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు పోటీ చేయొచ్చు.