సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఇదేం పని.. అడ్డంగా దొరికేశాడు..!

3 weeks ago 2
కూకట్‌పల్లి ప్రాంతంలోని వసంత నగర్ బస్ స్టాప్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు దొరికాడు. నిందితుడి నుంచి 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ప్రాంతానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి తరచూ అక్కడి నుంచి గంజాయిని తీసుకువచ్చి రమేష్ బాబుకి ఇచ్చి అమ్మకాలు జరిపిస్తూ ఉంటాడు. శుక్రవారం కూడా ఖమ్మం నుంచి తీసుకువచ్చిన గంజాయిని రమేష్ బాబుకి ఇస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు.
Read Entire Article