Nara Lokesh Serious On Parvathipuram Incident: పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఒక పాఠశాలను మోడల్ స్కూల్‌గా మార్చడం, మరో పాఠశాల మూసివేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. రాజకీయ పార్టీలు పాఠశాలల జోలికి రావద్దని మంత్రి లోకేష్ హెచ్చరించారు.