సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి రాణిగారితోటలోని పాడుబడ్డ భవనానికి సాయికృష్ణను తరలించినట్లు.. అక్కడ తీవ్రంగా కొట్టినట్లు సిట్ ఆరోపించింది. అనంతరం సాయికృష్ణ మృతి చెందగా.. మృతదేహాన్ని అర్ధరాత్రి తరలించి స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేసినట్లు పేర్కొంది. ఫొటోలు, ఇతర డిజిటల్ ఆధారాల తొలగింపు, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలపైనా దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. కోర్టు సురేష్‌కు సెప్టెంబర్ 24 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.