విశాఖ సింహాచలంలో చందనోత్సవం విషాదంగా మారింది. భారీ వర్షానికి క్యూలైన్‌పై గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గోడ నిర్మాణంలో లోపాలే కారణమని తెలుస్తోంది. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. బాధ్యులెవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ వివరాలు...