దేశంలోనే అతిపెద్ద స్టీల్ బ్రిడ్జిని సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజీవ్ రహదారి మీద నుంచి ఏర్పాటు చేయబోయే ఎలివేటెడ్ కారిడార్ అయిన 18.170 కిలోమీటర్ల మార్గంలో సుమారు 11 కిలోమీటర్ల పైన స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే హెచ్ఎండీఏ దీని కోసం టెండర్లను ఆహ్వానించబోతుంది. దీని నిర్మాణం త్వరగా పూర్తి కావడమే కాక.. పటిష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..